కేటీఆర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

By అంజి  Published on  30 March 2024 6:17 AM GMT
criminal case, BRS, KTR, Telangana

కేటీఆర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. రూ.2500 కోట్లు వసూలు చేసి ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి పంపారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. తొలుత హనుమకొండ పీఎస్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత బంజారాహిల్స్‌కు బదిలీ చేశారు. ఐపీసీ 504, 505(2) సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

''మున్సిపల్‌ శాఖను తన వద్దనే ఉంచుకున్న సీఎం రేవంత్‌రెడ్డి మూడు నెలలుగా డబ్బులిస్తేనే బిల్డింగులకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. అలా వసూలు చేసిన రూ.2,500 కోట్లను ఢిల్లీకి పంపారు. ఓవైపు ఇసుక దందా, రైస్‌ మిల్లర్లను, మరోవైపు బిల్డర్లు, రియల్టర్లను బెదిరిస్తూ డబ్బు వసూలు చేస్తున్నారు. కత్తెర పెట్టుకుని జేబు దొంగలా తిరుగుతున్నారు'' అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

Next Story