వరంగల్‌లో విషాదం..రోడ్డు ప్రమాదంలో 9 నెలల గర్భిణీ డాక్టర్ మృతి

వరంగల్ జిల్లా హంటర్‌ రోడ్డులో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 నెలల గర్భిణీ అయిన డాక్టర్ మృతి చెందారు.

By -  Knakam Karthik
Published on : 27 Jan 2026 2:24 PM IST

Telangana, Warangal, Road Accident, Pregnant Doctor Dies

వరంగల్‌లో విషాదం..రోడ్డు ప్రమాదంలో 9 నెలల గర్భిణీ డాక్టర్ మృతి

వరంగల్ జిల్లా హంటర్‌ రోడ్డులో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 నెలల గర్భిణీ అయిన డాక్టర్ మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న డాక్టర్‌ను లారీ ఢీకొట్టడంతో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కొలంబియా ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మమత (33) విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో హంటర్‌ రోడ్డులో వేగంగా వచ్చిన లారీ ఆమె ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ మమతను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.

డాక్టర్ మమత 9 నెలల గర్భిణీ కావడంతో ఈ ఘటన మరింత విషాదంగా మారింది. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, సహచరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ప్రమాదం పట్ల వైద్య వర్గాలు, స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, హంటర్‌ రోడ్డులో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రత చర్యలు మరింత కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story