Hyderabad : ఫేక్ సీఐడీ అధికారుల ముఠా గుట్టు రట్టు

ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులుగా నటించి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By Medi Samrat  Published on  30 Jan 2024 2:15 PM GMT
Hyderabad : ఫేక్ సీఐడీ అధికారుల ముఠా గుట్టు రట్టు

ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులుగా నటించి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ ఆరోపణలపై రాయదుర్గం పోలీసు అధికారులు జనవరి 30, మంగళవారం నాడు ఎనిమిది మంది సభ్యుల ముఠాను పట్టుకున్నారు. నాలుగు కార్లు, పదహారు మొబైల్ ఫోన్లు, రూ.35 వేల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్‌కు చెందినవారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫిర్యాదుదారు దర్శన్ సుగుణాకర శెట్టి AJA ADS ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్. ఈ సంస్థలో 40 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఇతర నిందితులలో న్యాయవాది మహేంద్ర కుమార్(38), ఐటీ నిపుణుడు షేక్ మహ్మద్ అబ్దుల్ ఖాదిర్(33), రియల్ ఎస్టేట్ ఏజెంట్ విజయ్ శేఖర్(32), మాజీ మేనేజర్ అక్కెర రంజిత్ కుమార్(47), అసోసియేట్ న్యాయవాది బలింగ రాహుల్(33), దాడిబోయిన సుబ్బకృష్ణ(40), సందీప్ కుమార్(31), రఘు రాజు(33) ఉన్నారు. ఈ ముఠాకు చెందిన ఇద్దరు వ్యక్తులు పోలీసు కానిస్టేబుల్ రాజా, సబ్-ఇన్‌స్పెక్ట‌ర్‌ సుజన్ - ఇప్పటికీ పరారీలో ఉన్నారు.

మహేంద్ర, రంజిత్ మొదట కంపెనీ డైరెక్టర్ నుండి డబ్బులు లాగాలని కుట్ర పన్నారు. కర్నూలుకు చెందిన పోలీసు అధికారి ఎస్‌ఐ సుజన్‌తో మహేంద్ర మాట్లాడారు. వారి ప్లాన్ ప్రకారం, జనవరి 26న, నిందితులు పోలీసు అధికారుల ముసుగులో ఐటీ కంపెనీకి వెళ్లి, కంపెనీలో అక్రమాలకు సంబంధించిన నివేదికను అందుకున్నామని బెదిరించారు. తొలుత రూ.10 కోట్లు అడిగారు. చర్చల సమయంలో, రూ. 2.3 కోట్లతో డీల్ ను ఓకె చేశారు. పరిమిత సమయం కారణంగా ఫిర్యాదుదారు రూ.71.80 లక్షలు మాత్రమే ఇవ్వగలిగారు. దీంతో ముఠా సభ్యులు ముగ్గురు ఉద్యోగులను బలవంతంగా తమ కార్లలో ఎక్కించుకుని మాదాపూర్‌లోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి గదిలో బంధించారు. మిగిలిన సొమ్ము ఇవ్వకుంటే ముగ్గురిని చంపేస్తామని బెదిరించారు. డైరెక్టర్లు స్పందించకపోవడంతో కిడ్నాపర్లకు అనుమానం వచ్చి అదే రోజు సాయంత్రం హోటల్ గదిలో బందీలను విడిచిపెట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు జనవరి 28న నిందితులను పట్టుకున్న రాయదుర్గం పోలీసులు.. వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లిన అనంతరం విచారించగా, నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. కిడ్నాప్ ముఠాలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ప్రస్తుతం కర్నూలు డీఐజీ ఆఫీసులో ఎస్ఐగా పని చేస్తున్న సృజన్ గా గుర్తించారు. ఏపీ పోలీసు శాఖలో మాజీ ఉద్యోగి రంజిత్ తో కలిసి, సీఐడీ పేరుతో కిడ్నాప్ ముఠాగా మారి కోట్లు వసూలు చేస్తున్నారు.

Next Story