తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఒక రోజు కేసులు తగ్గుతూ ఉంటే మరొక రోజు కాస్త పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 643 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,75,904 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,482 మంది మృతి చెందారు.
తాజాగా 805 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 2,66,925 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,497 ఉండగా, హోం ఐసోలేషన్లో 5,434 మంది చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.53 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది. అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు 96.74శాతం ఉండగా, దేశంలో 94.7శాతం ఉంది. తాజాగా అత్యధికంగా జీహెచ్ఎంసీలో 109 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.