493 New Corona Cases Reported In Telangana. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 29,084 కరోనా శాంపిల్స్ పరీక్షించగా..
By Medi Samrat Published on 24 Jun 2022 3:30 PM GMT
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 29,084 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. 493 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,322 కాగా, ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,98,125గా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)లో గత 24 గంటల్లో అత్యధికంగా 366 కేసులు నమోదయ్యాయి, రంగారెడ్డి (40), మేడ్చల్ మల్కాజిగిరి (34) అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.
24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 219 మంది కరోనావైరస్ నుండి కోలుకున్నారు, రికవరీ రేటు 99.07%గా ఉంది. గడిచిన 24 గంటల్లో 29,084 నమూనాలను పరీక్షించారు. 410 స్వాబ్ నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం మొత్తం 406 కేసులు నమోదయ్యాయి. మంగళవారం 298 కేసులు నమోదయ్యాయి.
కేసుల పెరుగుదలపై వైద్యులు మాట్లాడుతూ.. కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. కేసులలో జ్వరం స్వల్పంగా ఉంటుంది. ఇది వైరల్ ఫ్లూ లాంటిదని.. రెండు రోజుల్లో పేషెంట్లు కోలుకుంటున్నారని అన్నారు. హిందుపూర్ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ఱ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.