మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

45-year old man gets 20 yr imprisonment for rape of minor girl in Adilabad. ఐదు నెలల క్రితం ఉట్నూర్ మండల కేంద్రానికి చెందిన మైనర్ బాలికకు రూ.5 ఎర చూపి అత్యాచారానికి

By Medi Samrat  Published on  27 Sep 2022 12:02 PM GMT
మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

ఐదు నెలల క్రితం ఉట్నూర్ మండల కేంద్రానికి చెందిన మైనర్ బాలికకు రూ.5 ఎర చూపి అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై 45 ఏళ్ల వ్యక్తికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2వేలు జరిమానా విధించింది కోర్టు. ఆదిలాబాద్‌లోని పోక్సో కేసుల ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఏప్రిల్ 15న నమోదైన నేరంలో షేక్ హైదర్ దోషిగా తేలడంతో కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి మాధవి కృష్ణ తీర్పు వెలువరించారు.

తొమ్మిది మంది సాక్షులను విచారించిన కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. రమణ రెడ్డి సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించింది. మహారాష్ట్రకు చెందిన యాచక దంపతుల కుమార్తె అయిన ఆరేళ్ల బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో షేక్‌ హైదర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటి ఉట్నూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ హర్షవర్ధన్ విచారణ చేపట్టారు. యాదృచ్ఛికంగా, ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిన మొదటి కేసు ఇది. కేసు విచార‌ణ‌లో కీలక పాత్ర పోషించిన అధికారుల‌ను, సిబ్బందిని పోలీసు సూపరింటెండెంట్ డి ఉదయ్ కుమార్ రెడ్డి అభినందించారు.


Next Story
Share it