బాలిక‌పై అత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు విధించిన రంగారెడ్డి కోర్టు

మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో 40 ఏళ్ల వ్యక్తికి రంగారెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్టు జీవిత ఖైదు విధించింది

By Medi Samrat  Published on  9 Oct 2024 7:00 PM IST
బాలిక‌పై అత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు విధించిన రంగారెడ్డి కోర్టు

మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో 40 ఏళ్ల వ్యక్తికి రంగారెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అంతేకాకుండా అతడికి 20 వేల జరిమానా కూడా కోర్టు విధించింది. ఓ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న మహమ్మద్‌ అల్టా జిల్దానీ అనే వ్యక్తి తన భార్య సోదరిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలాపూర్ పోలీసులు U/S 376(2) (i),506 IPC & SEC 5(i)R/w 6 అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన భార్య సోదరి అయిన మైనర్ బాలికను మహమ్మద్‌ అల్టా జిల్దానీ బెదిరించి పలుమార్లు లైంగిక దాడి చేసాడు. అతడి వయసు 40 సంవత్సరాలు. హుమానీ ఇండస్ట్రీయల్ కంపెనీలో సూపర్‌వైజర్ గా ఉండేవాడు. అత్యాచారం, పోక్సో చట్టం ప్రకారం ఎల్ బి నగర్‌లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి నిందితుడిని దోషిగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధించారు. అలాగే బాధితురాలికి నష్టపరిహారం కింద రూ. 5,00,000 అందించనున్నారు.

Next Story