విషాదం నింపిన సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. రోడ్డుప్ర‌మాదంలో ముగ్గురి మృతి

3 Dead In Nagarjuna Sagar Accident. నాగార్జునసాగర్ పైలాన్‌కాలనీ వ‌ద్ద ఘోర‌ రోడ్డు ప్రమాదం జరిగింది.

By Medi Samrat  Published on  17 April 2021 7:26 PM IST
విషాదం నింపిన సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. రోడ్డుప్ర‌మాదంలో ముగ్గురి మృతి

నాగార్జునసాగర్ పైలాన్‌కాలనీ వ‌ద్ద ఘోర‌ రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు ప‌ర‌స్ప‌రం ఢీ కొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. నాగార్జున సాగర్ ఉప‌ఎన్నికలో ఓటు వేసేందుకు వెళ్తుండగా ప్రయాదం జరిగింది. మృతులను బంగారయ్య (40), రషీద్ (42), మల్లయ్య(36)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలావుంటే.. నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ పోలింగ్ ప్ర‌క్రియ రాత్రి 7 గంట‌ల‌కు ముగిసింది. ఇవాళ ఉద‌యం 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభం కాగా, మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు 69 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు వెల్ల‌డించారు. ఎండ కాస్త త‌గ్గ‌డంతో పోలింగ్ కేంద్రాల వ‌ద్దకు ఓట‌ర్లు బారులు తీరారు. సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు సాధార‌ణ ఓట‌ర్ల‌కు అనుమ‌తి ఇచ్చారు. ఇక 6 గంట‌ల త‌ర్వాత కొవిడ్ బాధితుల‌కు ఓటేసేందుకు అవ‌కాశం ఇచ్చారు.




Next Story