నేడు తెలంగాణ కేబినెట్‌ భేటీ.. ఆర్టీసీపైనే ప్రధాన చర్చ..!

By అంజి  Published on  28 Nov 2019 3:17 AM GMT
నేడు తెలంగాణ కేబినెట్‌ భేటీ.. ఆర్టీసీపైనే ప్రధాన చర్చ..!

హైదరాబాద్‌: నేడు సీఎం కేసీఆర్‌ సమక్షంలో కేబినెట్‌ భేటీకానుంది. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం ప్రారంభంకానుంది. ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం 52 రోజుల పాటు సమ్మె చేసిన విషయం అందరికి తెలిసిందే. సమ్మె విరమణ తర్వాత విధుల్లోకి చేరాలని కార్మికులు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అంశమే ప్రధాన ఎజెండా కేబినెట్‌ భేటీ జరగనుంది. రాష్ట్ర కేబినెట్‌ రేపు కూడా సమావేశం కానుంది.

ఇవాళ జరిగే కేబినెట్‌ భేటీలో ఆర్టీసీ భవిష్యత్తుపై రాష్ట్ర మంత్రుల సమక్షంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆర్టీసీ అంశంపై ప్రభుత్వం విధానం ఏమిటన్నది రేపటికల్లా సృష్టత రానుంది. కాగా ఈ కేబినెట్‌ భేటీపై అటూ ఆర్టీసీ కార్మికుల్లోనూ, ఇటూ ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. కాగా సమ్మె చట్టవిరుద్ధమైనదని తిరిగి కార్మికులను విధుల్లోకి చేర్చుకునేది ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ అన్నారు. కార్మికులను విధుల్లోకి చేర్చుకునేందుకు పెద్దగా ఇష్టపడని సీఎం కేసీఆర్‌ అందుకనుగుణంగా అడుగులు వేస్తున్నారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

ఆర్టీసీ ఒక శాశ్వత పరిష్కరం చూపాలని కేసీఆర్‌ ప్రభుత్వం భావిస్తోంది. కేబినెట్‌ భేటీలో ఆర్టీసీలో రూట్ల ప్రైవటీకరణ, కొత్త నియామకాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఆర్టీసీలో 5,100 రూట్లను ప్రైవేట్‌ పరం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు పచ్చ జెండా ఊపింది. ప్రైవేట్‌ పరం చేయడం చట్టవిరుద్ధం కాదని కోర్టు తేల్చి చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రైవేట్‌ రూట్లనీ తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రైవేట్‌ రూట్ల ఎంపికను అధికార యంత్రాగం పూర్తి చేసినట్టు తెలుస్తోంది. సమ్మె విరమించి విధుల్లో చేరతామన్న కార్మికుల వైఖరిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్న తాత్కాలిక సిబ్బందిని ఏం చేయాలన్న దానిపై కూడా కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు.

ఆర్టీసీ కార్మికులకు రెండు ప్రధాన షరతులు పెట్టి విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం. కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న శాశ్వత డిమాండ్‌ను వదిలేయాలి. మరో సమ్మెకు చేయకుండా కార్మికులు, కార్మిక సంఘాలతో సంతకాలు చేయించాలని సీఎం కేసీఆర్‌ చూస్తున్నట్టు సమాచారం. ఆర్టీసీ సమ్మె మొదలైనప్పటి నుంచి ఎన్నో సార్లు సమీక్షలు, సమావేశాలు నిర్వహించిన సీఎం కేసీఆర్‌... ఆర్టీసీ అంశంపై స్పందించలేదు. కేబినెట్‌ భేటీ కానుండడంతో.. సీఎం కేసీఆర్‌ తమపై సానుకూలంగా స్పందిస్తారని కార్మికులు ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు.

Next Story