దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటూ వి.సి.సజ్జనార్ ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేశారు.. 2018లో ఆయన సైబరాబాద్ పోలీసు కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన యాక్షన్స్ వలన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. కోవిద్-19 మహమ్మారి ప్రబలిన సమయంలో కూడా ఆయన ప్లాస్మా డొనేషన్ ను తీసుకుని వెళుతున్నారు.

ఈ మధ్య సజ్జనార్ కు సంబంధించిన పచ్చబొట్టు వేసుకున్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘ప్లాస్మా గాడ్’ అంటూ ఆ వ్యక్తి సజ్జనార్ ముఖాన్ని పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటోను చూసి చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సినీ తారలు, క్రికెటర్ల గురించి ఇలా పచ్చబొట్లు పొడిపించుకునే వారిని చూశాము.. కానీ ఇలా ఓ పోలీసు అధికారి ముఖాన్ని పచ్చబొట్టుగా పొడిపించుకోవడం చాలా గొప్పగా అనిపిస్తోందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తేజ అనే ఓ యాక్టివిస్ట్ ఈ ఫోటో తనకు ఫార్వర్డ్ మెసేజీ లాగా వచ్చిందని ట్విట్టర్ లో వెల్లడించాడు. దీంతో ఆ ఫోటో కాస్తా వైరల్ అవుతోంది. “I have got this pic through Forward and now it is also getting viral Where @cpcybd sir was printed as a Plasma God (sic).” అంటూ ట్వీట్ చేశాడు.

https://www.facebook.com/photo/?fbid=3559542940763014&set=a.556284547755550

ఫేస్ బుక్ లో కూడా వీడియోను షేర్ చేయడం జరిగింది.

న్యూస్ మీటర్ కు ఈ మెసేజీ వాట్సప్ లో అందింది. ఈ ఫోటో గురించి నిజా నిజాలు చెప్పాలని కోరారు.

01

నిజ నిర్ధారణ:
సైబరాబాద్ పోలీసు కమీషనర్ సజ్జనార్ బొమ్మను అభిమాని పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడన్నది ‘పచ్చి నిజం’.

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన మహేందర్ రెడ్డి అనే వ్యక్తి సజ్జనార్ కు అభిమాని. ఆ అభిమానాన్ని ఇలా పచ్చబొట్టు రూపంలో వేసుకుని చూపించాడు. పచ్చబొట్టు వేయించుకున్న మహేందర్ రెడ్డి వెళ్లి సజ్జనార్ ను కూడా కలిశాడు. మహేందర్ రెడ్డి చేతి మీద ఉన్న పచ్చబొట్టును సజ్జనార్ చూస్తున్న వీడియోను కూడా ట్విట్టర్ లో అప్లోడ్ చేశారు.

మహేందర్ రెడ్డిని న్యూస్ మీటర్ సంప్రదించగా తాను మెగా స్టార్ చిరంజీవి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వీరాభిమాని అని చెప్పుకొచ్చాడు. చిరంజీవి ట్యాటూను కూడా కొద్ది నెలల కిందట మహేందర్ రెడ్డి వేయించుకున్నాడు. తాను అభిమానిస్తున్న వాళ్ళను జీవితంలో ఒక్కసారైనా కలవాలని అనుకుంటూ ఉన్నానని మహేందర్ రెడ్డి వెల్లడించాడు.

02

మహేందర్ రెడ్డికి ట్యాటూలు వేసిన వ్యక్తి పేరు ఆరోన్ వర్మ.. చిరంజీవి ట్యాటూను వేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు కూడా చేశాడు.

https://www.facebook.com/watch/?v=731792377635576&extid=IGW14HHl4QKzsYHQ

03

04

మహేందర్ రెడ్డి ఓ రైతు.. లిల్లీ పూలు పండిస్తూ ఉంటాడు. హైదరాబాద్ కు వచ్చి ఆ పూలను అమ్ముతూ ఉంటాడు. మిగిలిన సమయంలో ట్యాక్సీని నడుపుతూ ఉంటాడు. చాలా కష్టపడి పని చేసే మహేందర్ రెడ్డికి సహాయం చేసే గుణం కూడా ఉంది. ఇప్పటి వరకూ 28 బ్లడ్ డొనేషన్ క్యాంపులను, ప్లాస్మా డొనేషన్ క్యాంపులను నిర్వహించాడు. 65 సార్లు రక్తాన్ని ఇచ్చానని మహేందర్ రెడ్డి చెప్పుకొచ్చాడు.

https://www.facebook.com/photo/?fbid=275096890193277&set=a.158000785236222

https://www.facebook.com/photo/?fbid=275097556859877&set=a.157999688569665

సైబరాబాద్ పోలీసు కమీషనర్ సజ్జనార్ బొమ్మను ఓ అభిమాని పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడన్నది నిజం. ఆ అభిమాని పేరు మహేందర్ రెడ్డి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort