Fact Check : పాకిస్థాన్ పతాకంతో రాఖీ సావంత్.. ఆమె నిజస్వరూపం బయట పడిందా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Sep 2020 11:57 AM GMTబాలీవుడ్ నటి రాఖీ సావంత్ కు చెందిన కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి, ఆ ఫోటోలలో రాఖీ సావంత్ పాకిస్థాన్ జాతీయ పతాకాన్ని పట్టుకుని ఉంది. ఓ నదీ తీరంలో రాఖీ సావంత్ పాకిస్థాన్ పతాకాన్ని పట్టుకుని నిలబడి ఉంది.
ఓ ఫేస్ బుక్ యూజర్ రాఖీ సావంత్ ఉన్న ఫోటోలను పోస్టు చేసి 'రాఖీ సావంత్ నిజ స్వరూపం ఇది.. ఎప్పుడు చూసినా రాఖీ సావంత్ భారతీయురాలినని గొప్పగా చెప్పుకొంటూ ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు.
“Here is the truth of Rakhi Sawant who keeps on talking rubbish about being Indian.” అంటూ పోస్టులు పెట్టారు.
ట్విట్టర్ లో కూడా అదే తరహా వ్యాఖ్యలతో రాఖీ సావంత్ మీద పలువురు విరుచుకుపడ్డారు.
నిజ నిర్ధారణ:
రాఖీ సావంత్ మీద వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. అది ఆమె నటించిన చిత్రానికి సంబంధించిన ఫోటోలు. 2019లో ఆమె 'ధార 370' అనే సినిమా షూటింగ్ లో పాల్గొన్న ఫోటోలు అవి.
గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. న్యూస్ మీటర్ కు పలు వార్తా కథనాలకు సంబంధించిన రిపోర్టులు లభించాయి. అందులో ఇవే ఫోటోలు కనిపించాయి. రిపోర్టుల ప్రకారం.. రాఖీ సావంత్ మే 8, 2019న పాకిస్థాన్ పతాకంను పట్టుకుని ఉన్న ఫోటోలను పోస్టు చేసింది. ధార 370 సినిమా షూటింగ్ లో భాగంగా రాఖీ ఆ పతాకాలను చేతిలోకి తీసుకుంది. అదంతా షూటింగ్ లో భాగంగానే చోటుచేసుకుంది. రాఖీ సావంత్ ఈ సినిమాలో ఐటం గర్ల్ గా నటించింది.
https://news24online.com/news/nation/rakshi-sawant-dares-modi-poses-pakistan-flagvideo-36878369/
సామాజిక మాధ్యమాల్లో రాఖీ సావంత్ ను పలువురు తప్పుబట్టారు. దీంతో ఆమె తన ఇంస్టాగ్రామ్ లో కూడా ఫోటోలను పోస్టు చేసింది. సినిమా షూటింగ్ లో భాగంగా తీసిన ఫోటోలు అంటూ క్లారిటీ ఇచ్చింది. “Here is the truth of Rakhi Sawant who keeps on talking rubbish about being Indian.” తన ఫోటోలను పోస్టు చేసింది. సినిమాలో తన క్యారెక్టర్ అలాంటిది అంటూ చెప్పుకొచ్చింది.
�
View this post on Instagram�
I love my india 🇮🇳 but its my character in the film 🎥 dhara 370
A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on
�
View this post on Instagram�
Im jast plying my character in the film 🎥
A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on
కాబట్టి, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.