ఆంధ్రప్రదేశ్ తెలుగు టెక్స్ట్ బుక్ లో జీసస్ గురించి ఓ చాప్టర్ ను ఉంచారంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మూడవ తరగతి విద్యార్థులు ఇకపై జీసస్ గురించి చదువుకోబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. మొదటి పాఠమే జీసస్ గురించి ఉంచారంటూ ఓ పోస్టు వైరల్ అవుతోంది.

ఫేస్ బుక్, ట్విట్టర్ లో పెద్ద ఎత్తున ఈ ఫోటోను షేర్ చేస్తూ ఉన్నారు. జీసస్ గురించి పొందుపరచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భగవద్గీత గురించి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నిస్తూ ఉన్నారు నెటిజన్లు. కొందరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తూ వచ్చారు.

“Dear AP CM, We know you have your preferences of religion and we respected that. Stop vandalizing #Hindu Temples and stop the imposition of religious beliefs on #Andhra Pradesh people right from 3rd standard. Telugu’s first chapter about #Jesus. #andhrapradeshtemples #APC2020,” అంటూ పోస్టులు పెట్టారు. మనోభావాలతో ఆటలాడుతూ ఉన్నారని.. ఇకనైనా మారాలంటూ సామాజిక మాధ్యమాల్లో చెప్పుకొచ్చారు.

https://www.facebook.com/photo/?fbid=10224612123960892&set=a.10200878376032027

https://www.facebook.com/photo/?fbid=139472947852858&set=a.109742064159280

నిజ నిర్ధారణ:

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన మూడవ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ లో జీసస్ కు సంబంధించిన పాఠ్యాంశం అన్నది సాలు లేదు.

వైరల్ అవుతున్న ఫోటోను గమనించగా.. పబ్లిషర్ AP SCERT కాదు.. శ్రీ షిరిడి సాయి గ్రూప్ పబ్లికేషన్స్ అని ఉంది.

01

ఆంధ్రప్రదేశ్ మూడవ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ గురించి సెర్చ్ చేయగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్(SCERT) టెక్స్ట్ బుక్స్ ను గమనించవచ్చు. మూడవ తరగతి టెక్స్ట్ బుక్స్ ను చూడగా.. అందులో లోగోను, ఆంధ్రప్రదేశ్ పబ్లికేషన్ ను కూడా చూడొచ్చు.

02
మూడవ తరగతిలో ఉన్న మొదటి మూడు యూనిట్లకు సంబంధించిన చాఫ్టర్లను చూడొచ్చు. వైరల్ అవుతున్న ఫోటో ఎక్కడ కూడా కనిపించలేదు.

03

04

05

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నట్లుగా మూడవ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ లో జీసస్ గురించి ఎటువంటి పాఠం లేదు. వైరల్ అవుతున్న పోస్టు ‘పచ్చి అబద్ధం’.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort