Fact Check : నరేంద్ర మోదీ పుట్టినరోజు నాడు పార్టీ చేసుకున్నారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Sep 2020 10:00 AM GMT
Fact Check : నరేంద్ర మోదీ పుట్టినరోజు నాడు పార్టీ చేసుకున్నారా..?

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే తన 70వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఆయనకు ఓ వైపు పుట్టినరోజు శుభాకాంక్షలు రాగా.. మరో వైపు ఉద్యోగాల రూపకల్పనకు ఏయే చర్యలు తీసుకున్నారో చెప్పండి అంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు గుప్పించారు. ఆయన పుట్టినరోజు నాడు "National Unemployment Day” “#NationalBergerGuardday” “#NationalUnemployementDDay” అనే హ్యాష్ ట్యాగ్ లు వైరల్ అయ్యాయి.

http://web.archive.org/web/20200919065946/https://www.facebook.com/ModiLiesOfficial/videos/2710569805847618/?extid=UfNV0PpexgGTNy6b

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలంటూ పలువురు రాజకీయ నాయకులు కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి సమయంలో నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో ముందు 'ఎంతో మంది యువత ఉద్యోగాలు లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. కానీ మోదీ మాత్రం తన పుట్టినరోజును పలువురు ఇండస్ట్రియలిస్టులతో కలిసి నిర్వహించుకున్నారు' అని రాశారు. నరేంద్ర మోదీ తన చేతిలో ఓ గ్లాస్ పెట్టుకున్నారు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు కూడా వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నారు.

నిజ నిర్ధారణ:

ఈ వీడియోను జులై 2017న చిత్రీకరించారు. మోదీ మీద వైరల్ అవుతున్న పోస్టు 'పచ్చి అబద్ధం'.

Modi Lies అనే ఫేస్ బుక్ పేజీలో ఈ వీడియోను పోస్టు చేశారు. Sir is celebrating his birthday by hitting the glass with industrialists and the youth of the country is suffering from unemployment.” సార్ పారిశ్రామికవేత్తలతో కలిసి గ్లాసులో తాగుతూ ఉంటే.. దేశ యువత మాత్రం నిరుద్యోగంతో సతమతమవుతోంది అని పోస్టులో చెప్పుకొచ్చారు.

కీవర్డ్స్ ఆధారంగా న్యూస్ మీటర్ ఈ విషయాన్ని సెర్చ్ చేయగా.. దీనికి సంబంధించిన పలు వీడియోలు కనిపించాయి. జులై 2017న ఈ వీడియో తీశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ కు వెళ్లగా అక్కడ హైఫా నగరంలో పర్యటన చివరి రోజుకు సంబంధించిన ఘటన ఇది.

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అక్కడి మొబైల్ ఫిల్ట్రేషన్ ప్లాంట్ గురించి వివరించారు. సముద్రంలోని ఉప్పు నీటిని కూడా అక్కడ ఉన్న వాహనం మంచి నీరుగా మార్చేస్తుందని చూపించారు. అలా మార్చబడ్డ నీటిని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తాగారు. నరేంద్ర మోదీ కూడా తాగారు. ఆ వీడియోనే ప్రస్తుతం మరోసారి వైరల్ అవుతోంది. అందుకు సంబంధించిన వీడియోలను మీరు చూడొచ్చు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ పాత పర్యటనకు సంబంధించిన వీడియోకు తప్పుడు కథనాలను చేర్చి వైరల్ చేస్తూ ఉన్నారు. 'వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.'

Next Story