లాక్‌డౌన్‌ వల్ల తెలంగాణకు రూ.70వేల కోట్ల నష్టం

By సుభాష్  Published on  15 July 2020 2:46 PM IST
లాక్‌డౌన్‌ వల్ల తెలంగాణకు రూ.70వేల కోట్ల నష్టం

కరోనా మహమ్మారి.. మన ఆరోగ్యాల్నే కాదు.. మన సమాజాన్నే ఆర్థికంగా ఆగంచేసింది. కొవిడ్‌ కట్టడికోసం అమలుచేసిన లాక్‌డౌన్‌ వల్ల తెలంగాణ ప్రజలు దాదాపు రూ.70 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయారు. ఇది రాష్ట్ర జీఎస్డీపీలో 7.9%గా ఉంటుందని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) అంచనావేసింది. పన్నుల రూపంలో రావాల్సిన రూ.7 వేల కోట్ల రాబడిని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందని తెలిపింది.

కరోనాతో నష్టం.. అంతా ఇంతా కాదు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ కారణంగా తెలంగాణ రాష్ట్రం వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అంచనా వేసింది. లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని వెల్లడించింది. మంగళవారం సెస్‌ విడుదల చేసిన ఐదు పేజీల నివేదికలో ఏయే రంగాలు లాక్‌డౌన్‌ వల్ల నష్టపోయాయో పేర్కొంది. నివేదిక తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ రంగం మినహా అన్ని రంగాలపై ప్రతికూల ఫలితాలు చూవిచూశాయని వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో కీలకమైన నిర్మాణ, ఉత్పాదక రంగాలు వందశాతం నష్టాలు చవి చూశాయని నివేదిక తెలిపింది.

తెలంగాణ లో లాక్‌డౌన్‌ వల్ల రోజుకు రూ.1,784 కోట్ల మేర నష్టపోయినట్లు అంచనా. ఉత్పాదక, వ్యాపార, మరమ్మతు సేవలు, రియల్‌ఎస్టేట్‌రంగాలు రోజుకు రూ.1200 కోట్లు నష్టపోయాయి. మొత్తం మీద లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు రూ.70వేల కోట్ల నష్టం వచ్చింది. 2019-20 జీఎస్‌డీపీని పోల్చుకుంటే 7.9 శాతం నష్టం ఉంటుందని అంచనా. పది శాతం ట్యాక్స్‌ జీఎస్‌డీపీ రేషియో చూసుకుంటే సర్కార్‌కు నేరుగా ఒక్క రోజు రూ.178.4 కోట్లు,మొత్తం లాక్‌డౌన్‌ సమయంలో రూ.7వేల కోట్లు నష్టపోయినట్లు సెస్‌ అంచనా వేసింది.

మొత్తంమీద రాష్ర్టానికి లాక్‌డౌన్‌ కాలంలో దాదాపు రూ.70,000 కోట్లు నష్టం వచ్చింది. 2019-20 జీఎస్‌డీపీని పోల్చుకొంటే, 7.9 శాతం నష్టం ఉంటుందని అంచనా. 10% టాక్స్‌ జీఎస్‌డీపీ రేషియో చూసుకుంటే ప్రభుత్వానికి నేరుగా ఒక్క రోజుకు రూ.178.4 కోట్లు, మొత్తం లాక్‌డౌన్‌ సమయంలో రూ.7 వేల కోట్లు నష్టపోయిందని సెస్‌ అంచనా వేసింది.

ప్రస్తుతం కష్టాల నుంచి తెలంగాణ రాష్ట్రం కోలుకుంటుందని, వ్యవసాయం, వ్యవసాయేతర, స్వయం ఉపాధి రంగాల నుంచి ఆర్థికంగా బయటపడే అవకాశాలున్నాయని తెలిపింది. వ్యవసాయ పనులు ఆగకపోవడం వల్ల ఇబ్బందులు తప్పాయని, అలాగే తిండి గింజలతోపాటు పాలు, పండ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలకు ఇబ్బంది రాలేదు. ఇక హోటల్‌ రంగంపై 80 శాతం ఎఫెక్ట్‌ పడిందని వెల్లడించింది.

Next Story