ధరలు పెంచుతున్నాం.. ఆగమాగం చేశారో..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 May 2020 1:42 AM GMT
కరోనా వ్యాప్తి నేఫథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండవ విడత లాక్‌డౌన్ 7వ తేదీ నుండి ముగియనుండటంతో నిన్న మద్యాహ్నం సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి వర్గ భేటీ జరిగింది. ఏడు గంటల పాటు జరిగిన ఈ సుధీర్ఘ భేటీలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. లాక్‌డౌన్‌ను మే 29వరకూ పొడిగించారు.
ఇక మే 4నుండి మన పొరుగు రాష్ట్రాల్లో మద్యం తెరిచిన నేఫథ్యంలో.. తెలంగాణలో కూడా షాపులు తెరవనున్నారా.. లేదా.. అన్న ఉత్కంఠకు నిన్న రాత్రి మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ తెరదించారు. లాక్‌డౌన్ నేఫథ్యంలో కొన్ని సూచనలు చేస్తూ.. మద్యం షాపులకు అనుమతినిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రీన్, ఆరెంజ్, రోడ్ జోన్‌లలో వైన్ షాపులకు అనుమతినిచ్చిన ప్రభుత్వం.. కంటైన్మెంట్ ఏరియాలలో మాత్రం షాపులు తెరవకూడదని ఖచ్చితంగా చెప్పింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మద్యం షాపులు తెరుస్తారని అన్నారు. అయితే.. మద్యం ధరలను 16శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఇక షాపుల వద్ద గుంపులు గుంపులుగా చేరి భౌతిక దూరం పాటించని యెడల వెంటనే షాపులను రద్ద చేస్తామని హెచ్చరించడంతో పాటు.. షాపు యజమానీ, వినియోగదారుడు ఇద్దరిపై చర్యలు ఉంటాయని హెచ్చరించాడు. ఖచ్చితంగా వ్యక్తికి.. వ్యక్తికి మధ్య ఆరు ఫీట్ల దూరం పాటించాలన్నారు. మద్యం షాపుల యజమానులు నో మాస్క్- నో లిక్కర్ నినాదంతో అమ్మకాలు జరిపాలని సీఎం కేసీఆర్ సూచించారు.
పెరిగిన ధరల ప్రకారం :