రేపటి నుంచి మద్యం షాపులు ఓపెన్‌: సీఎం కేసీఆర్‌

By సుభాష్  Published on  5 May 2020 5:30 PM GMT
రేపటి నుంచి మద్యం షాపులు ఓపెన్‌: సీఎం కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. మే 29వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటిచారు. మంగళవారం ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు ప్రకటించారు. అలాగే అలాగే మద్యం ప్రియులకు కూడా గుడ్‌ న్యూస్‌ కూడా వినిపించారు సీఎం కేసీఆర్‌. నెలకుపైగా మూతపడిన మద్యం షాపులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. రేపటి నుంచి (బుధవారం) నుంచి తెలంగాణలో మద్యం అమ్మకాలు జరుగుతాయని ప్రకటించారు. కంటైన్‌మెంట్‌ జోన్‌లలో మాత్రం మద్యం షాపులు తెరుచుకోవని స్పష్టం చేశారు. రెడ్ జోన్ లలో కూడా మద్యం అమ్మకాలు జరుగుతాయన్నారు.

అలాగే మద్యం ధరలను కూడా పెంచుతున్నట్లు తెలిపారు. చీప్‌ లిక్కర్‌పై 11 శాతం, మిగిలిన వాటిపై 16 శాతం ధరలు పెంచామన్నారు. కానీ కొన్ని నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు. ప్రతి మద్యం షాపు వద్ద భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. పూర్తి స్థాయిలో తగ్గిపోయే వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలన్నారు. కరోనా పూర్తిగా తరిమికొట్టాలంటే లాక్‌డౌన్‌ విధించడం ఖచ్చితమని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంటాయన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో 15 మద్యం దుకాణాలు మాత్రమే తెరుచుకోవని, అలాగే బార్లు, పబ్‌లు, క్లబ్బులకు అనుమతి లేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Next Story