క్యాబ్ ల సమ్మె... కష్టాల్లో ప్రజలు
By సత్య ప్రియ Published on 19 Oct 2019 5:43 AM GMTఈ రోజు అంటే అక్టోబర్ 19, 2019 నుంచీ హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్లు నిరవధిక సమ్మెకు వెళ్లుతున్నారు. ఉబర్, ఓలా, ఐటీ కంపెనీలకు సేవలందిస్తున్న 50వేల క్యాబ్‌లు సమ్మెలో పాల్గొంటున్నాయి.
కిలోమీటర్‌కు కనీస రుసుము రూ.22 చేయాలన్న డిమాండ్‌తో సమ్మె చేయనున్నట్లు వెల్లడించారు. డ్రైవర్లకు కనీస వ్యాపార హామీ అందించాలని, ఐటీ కంపెనీలకు అనుసంధానంగా పనిచేస్తున్నవారికి జీవో 61, 66 అమలు చేయాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లపై దాడుల కేసులను పరిష్కరించేందుకు వినియోగదారుల కేవైసీ తప్పనిసరి చేయాలని, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సలావుద్దీన్ కోరారు. అలాగే ఈనెల 19వ తేదీన ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
దీనితో బస్సులు లేక సతమతమవుతున్న ప్రజలు ఇక క్యాబులు కూడా లేక దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
Next Story