హైదరాబాద్ : డా.లక్ష్మణ్ స్వల్ప అస్వస్థతతో నిమ్స్‌లో చేరారు. బస్సు భవన్‌ దగ్గర లక్ష్మణ్ సొమ్మసిల్లి పడిపోయారు. ఉదయం నుంచి ఆయన ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బస్సు భవన్‌ దగ్గర కూర్చున్నారు. అక్కడ జరిగిన తోపులాటలో లక్ష్మణ్ సొమ్మసిల్లి పడిపోయారు . డా.లక్ష్మణ్ ఆరోగ్య పరిస్థితిని బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా ఫోన్‌లో అడిగి తెలుసుకున్నారు. లక్ష్మణ్ ను అరెస్ట్ చేసి నారాయణగూడ పీఎస్‌కు తరలించినట్లు తెలుస్తోంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.