వీరిలో ఎవరితో డేట్‌కు వెళ్లాలని ఉందని అడిగిన భజ్జీ‌, యువీ‌.. షాకిచ్చిన గంగూలీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2020 1:33 PM IST
వీరిలో ఎవరితో డేట్‌కు వెళ్లాలని ఉందని అడిగిన భజ్జీ‌, యువీ‌.. షాకిచ్చిన గంగూలీ

కరోనా ముప్పుతో క్రీడలు అన్ని రద్దు అయ్యాయి. ఇక లాక్‌డౌన్‌తో క్రికెట్‌కు సంబంధించిన కార్యకలాపాలు ఏమీ లేకపోవడంతో ప్రస్తుత క్రికెటర్లతో పాటు మాజీ ఆటగాళ్లు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. వీరంతా ప్రస్తుతం సోషల్ మీడియాలో మయా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇటీవల అందరిని ఆకర్షిస్తున్న యాప్‌ జెండర్‌ స్వాప్. ఈ యాప్‌ ఆడవారు మగవారిగా, మగవారు ఆడవారిగా మారితే ఎలా ఉంటారో అలా చూపిస్తుంది. మొదటగా స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్.. హిట్ మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఫోటోను జెండర్‌ స్వాప్‌లో మార్చి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఎకౌంట్‌లో పోస్టు చేశాడు.

ఇప్పుడు అదే బాట పట్టారు యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌. ఒకరు ప్రస్తుత తరం క్రికెట్‌ ఆడుతున్న వారి ఫోటోలు స్వాప్‌ చేయగా.. మరొకరు పాతతరం క్రికెటర్ల ఫోటోలను స్వాప్‌ చేశాడు. మొదట యువరాజ్‌ ప్రస్తుతం క్రికెట్‌ ఆడుతున్న వారి ఫోటోలను స్వాప్‌ చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. వీరిలో మీరు ఎవరితో డేట్‌కు వెళ్లాలని ఉందని కామెంట్‌ పెట్టాడు. అంతేకాదు తాను ఎవరితో డేట్‌ వెళ్లాలనుకునేది రేపు చెబుతానని ట్వీట్‌ చేశాడు. ఆఫోటోలో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, ధావన్‌, రాహుల్‌, ధోని, రవీంద్రజడేజా, హార్థిక్‌ పాండ్యా, అజింక్యా రహానే, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌. అశ్విన్‌, షమీ, చాహల్‌, బుమ్రా ఉన్నారు.

వెంటనే హర్భజన్‌ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ మాజీ ఆటగాళ్ల స్వాప్‌ చేసిన ఫోటోలను పోస్టు చేశాడు. వీరిలో ఎవరితో డేట్‌ వెళ్లాలని ఉందని కామెంట్‌ పెట్టాడు. ఈ ఫోటోలో వీరేంద్ర సెహ్వాగ్‌, హర్భజన్‌ సింగ్‌, సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్ ద్రావిడ్‌, సౌరవ్‌ గంగూలి, యువరాజ్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, గౌతమ్‌ గంభీర్‌, నెహ్రా ఉన్నారు. ఇక హర్భజన్‌ పోస్టుపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలి స్పందించాడు. కళ్లద్దాలతో మధ్యలో ఉన్న అమ్మాయితో డేట్‌కు వెళతానని దాదా సరదాగా కామెంట్‌ చేశారు. ఇంతకీ అది ఎవరు అని అనుకుంటున్నారా.. ఆ ఫోటోలో ఉన్నది గంగూలీనే. ప్రస్తుతం యువరాజ్‌, హర్భజన్‌ సింగ్‌ పోస్టు చేసిన ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

Next Story