బిగ్ బ్రేకింగ్: పది మంది పాకిస్థాన్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Jun 2020 2:05 PM GMT
బిగ్ బ్రేకింగ్: పది మంది పాకిస్థాన్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్

ముగ్గురు పాకిస్థాన్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్ అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఏడుగురు పాకిస్థాన్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. కోవిద్-19 పాజిటివ్ అని తేలిన క్రికెటర్లలో మొహమ్మద్ హఫీజ్, వాహబ్ రియాజ్ లు కూడా ఉన్నారు. ఇంగ్లాండ్ టూర్ కు వెళ్ళబోతున్న మొత్తం 10 మంది పాకిస్థాన్ క్రికెటర్లకు కోవిద్-19 పాజిటివ్ అని తేలిందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.

మంగళవారం నాడు వచ్చిన రిజల్ట్స్ లో కషిఫ్ భట్టి, మొహమ్మద్ హస్నైన్, ఫకర్ జమాన్, మొహమ్మద్ రిజ్వాన్, ఇమ్రాన్ ఖాన్, హఫీజ్, రియాజ్ లు ఉన్నారు. సోమవారం జరిగిన టెస్టుల్లో షాదాబ్ ఖాన్, హైదర్ అలీ, హారిస్ రవూఫ్ లకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఫిట్ గా ఉన్న పది మంది అథ్లెట్లకు కరోనా పాజిటివ్ అని తేలడం మంచి విషయం కాదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సియిఓ వాసిమ్ ఖాన్ మీడియా కాన్ఫరెన్స్ లో తెలిపారు.

సపోర్ట్ స్టాఫ్ మెంబర్ అయిన మసూర్ మలంగ్ అలీకి కూడా కోవిద్-19 పాజిటివ్ వచ్చిందని తెలిపారు. లాహోర్ లో మళ్లీ ఇంకో రౌండ్ కరోనా టెస్టులు జరుగుతాయని.. జూన్ 25న పరిస్థితిని చూసి కొత్త స్క్వాడ్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూసి తాము భయపడడం లేదని.. కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.

కరోనా పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లను సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్లాలని పీసీబీ కోరింది. అధికారులు ఎప్పటికప్పుడు క్రికెటర్లతో టచ్ లో ఉన్నారు. ఇమాద్ వసీం, ఉస్మాన్ శిన్వారీ లకు రావల్పిండిలో కరోనా టెస్టులు నిర్వహించగా వారికి కరోనా నెగటివ్ వచ్చింది. వీరిద్దరూ జూన్ 24న లాహోర్ కు వెళ్ళడానికి అధికారులు అనుమతిని ఇచ్చారు. ఆ జట్టు సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ లకు కూడా టెస్టులు నిర్వహించారు. వారి రిజల్ట్స్ రావాల్సి ఉంది. మూడు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడడానికి పాకిస్థాన్ జట్టు జూన్ 28న ఇంగ్లాండ్ కు బయలుదేరనుంది.

Next Story