మంత్రికి నెగిటివ్‌.. కానీ భార్య‌కు, కూతురుకు క‌రోనా పాజిటివ్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Jun 2020 12:00 PM GMT
మంత్రికి నెగిటివ్‌.. కానీ భార్య‌కు, కూతురుకు క‌రోనా పాజిటివ్‌

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తుంది క‌రోనా. సామాన్యుడి నుండి దేశాధ్య‌క్షుల వ‌ర‌కూ ఎవ‌రిని వ‌ద‌ట్లేదు. భార‌త్‌లో మొన్న‌టి వ‌ర‌కూ సామాన్యుడికే ప‌రిమిత‌మైన క‌రోనా నేడు మంత్రులు, వారి సిబ్బంది అలా పాకుతూ వెళుతుంది. ఇక పొరుగు రాష్ట్రం కర్ణాటకలో మంత్రి కె. సుధాకర్‌ ఫ్యామిలీ క‌రోనా బారిన ప‌డింది.ఈ విషయాన్ని స్వయంగా మంత్రే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తమ కుటుంబం కరోనా టెస్టులు చేయించుకుందని, టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయని తెలిపాడు. అయితే.. ఆ టెస్టుల‌లో తనకు, తన ఇద్దరు కుమారులకు కరోనా నెగిటివ్ రాగా.. దురదృష్టవశాత్తూ తన భార్య, కుమార్తెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని మంత్రి సుధాకర్ ప్రకటించారు. వారికి చికిత్స జరుగుతోందని.. మీ అంద‌రి ప్రేమ‌కు, ఆప్యాయ‌త‌కు ధ‌న్య‌వాదాలు అని ట్వీట్‌లో తెలిపాడు.

ఇదిలావుంటే.. మంత్రి సుధాకర్ తండ్రి పీఎన్ కేశవరెడ్డి(82)కి సోమవారం కరోనా సోకింది. ఒక్కరోజు వ్యవధిలోనే మంత్రి భార్య, కుమార్తె కూడా కరోనా బారినపడినట్లు వెల్లడైంది. ఏప్రిల్‌లో మంత్రి సుధాక‌ర్‌.. మరో ముగ్గురు మంత్రులు నిర్వహించిన ఓ సమావేశానికి హాజరైన జర్నలిస్ట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. మంత్రి అప్పుడు క్వారంటైన్‌లో కూడా ఉన్నారు. అయితే తాజాగా త‌న కుటుంబంలో క‌రోనా రావ‌డం క‌ల‌వ‌ర‌ప‌రిచే విష‌యం.

Next Story
Share it