కరోనా నుంచి కోలుకున్నవారిలో రోగ నిరోధక శక్తి తగ్గుతుందా..!

By సుభాష్  Published on  23 Jun 2020 10:09 AM GMT
కరోనా నుంచి కోలుకున్నవారిలో రోగ నిరోధక శక్తి తగ్గుతుందా..!

కరోనా తెచ్చే కష్టాలు అన్ని ఇన్ని కావు. చైనాలో పుట్టిన ఈ మాయదారి మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. కొందరికి కరోనా వచ్చిన తర్వాత కూడా మళ్లీ నెల రోజుల్లోనే తిరగబడే అవకాశాలున్నాయని కూడా పరిశోధనల్లో తేలింది. అయితే కరోనా నుంచి కోలుకున్న వారికి కొత్త సమస్య ఎదురవుతోంది. కరోనా నుంచి కోలుకున్న వారికి భవిష్యత్తులో యాంటీబాడి స్థాయిలు తగ్గిపోతాయని చైనా పరిశోధకులు చెబుతున్నారు. కరోనాపై సుదీర్ఘ పోరాటం చేయడం వల్ల అవి శక్తిని కోల్పోతాయని వెల్లడించారు.

ఒక చైనీస్‌ అధ్యయనం ప్రకారం.. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడిన రోగ నిరోధక శక్తి తగ్గుముఖం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. జూన్‌ 18న నేచర్‌ మెడిసిన్‌లో ప్రచురించబడిన చాంగ్‌కింగ్‌ మెడికల్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. రోగ లక్షణాలు ఉన్న 37 మంది కరోనా బాధితులు, రోగ లక్షణాలు లేని 37 మంది రోగులపై ఈ అధ్యయనం చేసినట్లు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వ్యక్తి రెండు, మూడు నెలల్లో రోగ నిరోధక శక్తి బాగా పడిపోయాయని పరిశోధనలలో తేలిందని చెప్పారు. ప్రధానంగా యాంటీబాడీ స్థాయిలు మరింత క్షిణించే అవకాశం ఉంటుందన్నారు. దీంతో కరోనా బారిన పడిన వ్యక్తికి రోగ నిరధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు పరిశోధకులు.

సాధారణంగా రోగ నిరోధశక్తి పెంచుకునేందుకు సరైన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. నల్లద్రాక్ష, వేరు శనగలు, పిస్తా, మల్బరీస్‌, స్ట్రా బెర్రీలు క్రమం తప్పకుండా తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే విటమిన్‌-సి ఉన్న జమ, బత్తాయి, కమలాపండు, నిమ్మకాయ లాంటి పండ్లను తీసుకోవాలంటున్నారు. కెరోటినాయిడ్స్‌ఉ న్న ఆహార పదార్థాలు అయిన చిలగడ దుంప, బొప్పాయి, క్యారెట్‌ తీసుకోవాలి. ఇక వెల్లుల్లి, అల్లం, పసుపు, మిరియాలు, ఆకు కూరలు ముఖ్యంగా మునాకు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు.

Next Story