వరల్డ్ నంబర్ వన్‌ను కూడా వదలని కరోనా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Jun 2020 1:14 PM GMT
వరల్డ్ నంబర్ వన్‌ను కూడా వదలని కరోనా

కరోనా మహమ్మారి బారిన పలువురు ప్రముఖులు పడ్డారు. క్రీడాకారులు కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. టెన్నిస్ ఆటగాడు ప్రపంచ నెంబర్ వన్ జొకోవిక్ కు తాజాగా కరోనా టెస్టులు నిర్వహించగా అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. మొదట జొకోవిక్ కు కరోనా పాజిటివ్ అంటూ వార్తలు వచ్చాయి. అవి నిజమో కాదో తెలుసుకోవాలని అభిమానులు అనుకున్నారు. తాజాగా ఆయన ప్రతినిధులు జొకోవిక్ కు కరోనా పాజిటివ్ అని ధృవీకరించారు.

సెర్బియా, క్రొయేషియాలో ఇటీవల నిర్వహించిన టెన్నిస్ ఎగ్జిబిషన్ సిరీస్ లో జొకోవిక్ పాల్గొన్నాడు. అక్కడే జొకోవిక్ కు కరోనా సోకి ఉండొచ్చు అని భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి బెల్గ్రేడ్-జాడర్ లో ఉంటున్నాడు. జొకోవిక్ కు ఎటువంటి కరోనా లక్షణాలు కనిపించకపోయినప్పటికీ టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది. బెల్గ్రేడ్ కు వచ్చిన వెంటనే జొకోవిక్ కుటుంబం కరోనా టెస్టులు చేయించుకుంది. జొకోవిక్ భార్య జెలెనాకు కూడా పాజిటివ్ వచ్చింది. పిల్లలకు కోవిద్-19 నెగటివ్ అని వచ్చిందని జొకోవిక్ తన స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. అభిమానులు ఆందోళన పడకండి అని కోరాడు.

Next Story