ముగ్గురు క్రికెటర్లకు కరోనా

By సుభాష్  Published on  23 Jun 2020 2:03 AM GMT
ముగ్గురు క్రికెటర్లకు కరోనా

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దేశాలన్నింటినీ పట్టిపీడిస్తోంది. ఇక పాకిస్థాన్‌లో కరోనా తీవ్రతరమవుతోంది. అక్కడ రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఇక తాజాగా మరో ముగ్గురు క్రికెటర్లకు సోకింది. పాక్‌ క్రికెటర్లు షాదాబాబ్‌, హరీష్‌రవూఫ్‌, హైదర్‌ ఆలీలు ఈవైరస్‌ బారిన పడినట్లు పాక్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఇంగ్లాండ్‌ టూర్‌కు వెళ్లే ముందు రావల్పిండిలో ఆదివారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఎలాంటి లక్షణాలు రాలేవని తెలిసింది. అయితే ఈ ముగ్గురికి పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌ వచ్చినట్లు బోర్డు తెలిపింది.

వెంటనే వీరిని క్వారంటైన్‌కు తరలించినట్లు పేర్కొంది. ఇక ఎస్మాన్‌, ఇమామ్‌వసీం కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, నెగిటివ్‌ వచ్చిందన్నారు. ఇంకా కొందరు క్రికెటర్లు, అధికారులకు కరాచీ, లాహోర్‌, పెషావర్‌లలో మంగళవారం కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా, పాకిస్థాన్‌లో ఇప్పటి వరకూ 1.82 కరోనా కేసులు నమోదు కాగా, 3606 మంది మృతి చెందారు.

Next Story