సూర్యాపేటలో వెలుగులోకి టీచర్ రాసలీలలు..
By అంజి Published on 21 Dec 2019 11:57 AM IST
సూర్యాపేట జిల్లాలో కీచక ఉపాధ్యాయుడి రాసలీలలు బయటపడ్డాయి. చదువు చెప్పాల్సిన గురువు కామంతో కళ్లు మూసుకుపోయి మానవ మృగంలా తయారయ్యాడు. హుజుర్‌నగర్ మండలం బూరుగడ్డ ప్రభుత్వ పాఠశాలలో హిందీ టీచర్‌గా గత కొన్ని రోజులుగా పి.వి సత్యనంద్ పని చేస్తున్నాడు. స్టడీ అవర్ పేరుతో 10వ తరగతి విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గుర్తి చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మొదట మంచి ఉపాధ్యాయుడిలా నటించిన సత్యనంద్.. తర్వాత తనలో ఉన్న కామ మృగాన్ని నిద్ర లేపాడు. దీంతో ఉపాధ్యాయుడి ప్రవర్తనలో వచ్చిన మార్పును విద్యార్థినిలు పసిగట్టారు. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం, మాటలతో విద్యార్థులతో శారీరకంగా లోబరుచుకునే విధంగా ప్రవర్తిస్తుండంటో విద్యార్థులకు అనుమానం కలిగింది.
రోజు రోజుకు ఉపాధ్యాయుడి వేధింపులు మరింత పెరగడంతో విద్యార్థులు ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోయారు. రాత్రి 10 గంటల సమయంలో విద్యార్థిని ఇంటికి ఫోన్ చేసి మానసికంగా గుర్తి చేస్తున్నాడని విద్యార్థులు విలపిస్తున్నారు. ధైర్యం చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి జరిగిన విషయం విద్యార్థులు చెప్పారు. కాగా అందరూ ఉపాధ్యాయులతో మీటింగ్ ఏర్పాటు చేసి సత్యనంద్‌కు కౌన్సిలింగ్ ఇచ్చారు. మీటింగ్ సమయంలో తాను విద్యార్థినిలను ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని మాటమార్చాడు. గురువే ఇలా కామాంధుడిగా మారి ఎంతో మంది ఉపాధ్యాయులకు మచ్చ తెస్తున్నారని సదరు ఉపాధ్యాయులు వాపోతున్నారు.