ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి

By సుభాష్  Published on  20 Dec 2019 5:09 AM GMT
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి

విజయవాడ లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు ప్రేమికులు విజయవాడ లోని ఓ హోటల్ లో పురుగులు మందు తాగి అత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రియురాలు మృతి చెందగా, ప్రియుడు లోకేష్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మృతురాలు విజయవాడ సమీపంలో ని ఓ ప్రైవేటు కాలేజిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, కొంత కాలంగా ప్రేమించుకుంటున్న వీరు పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించకపోవడంతో ఈ ఆత్మహ్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it