టీడీపీ రాష్ట్ర కమిటీ ప్రకటన

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Nov 2020 6:23 AM GMT
టీడీపీ రాష్ట్ర కమిటీ ప్రకటన

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. చంద్ర‌బాబు నేతృత్వంలోని టీడీపీ గ‌త ఎన్నిక‌ల‌లో ఘోర వైఫ‌ల్యాన్ని చ‌విచూసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేఫ‌థ్యంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, 2024 ఎన్నికల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజ‌య‌భేరి మోగించాలని ఇప్పట్నుంచే తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తోంది.

001

ఇందులో భాగంగా తెలుగుదేశం అధిష్టానం తాజాగా పలు రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. మొత్తం 219 మందితో టీడీపీ రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 18 మంది ఉపాధ్యక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. 18 మంది అధికార ప్రతినిధులు, 58 కార్యనిర్వాహక కార్యదర్శులు ఉన్నారు.

ఇక‌ టీడీపీ రాష్ట్ర కమిటీలో 108 మంది రాష్ట్ర కార్యదర్శులు, కోశాధికారులతో పాటు బడుగు, బలహీన, ఎస్సీలకు 61 శాతం పదవులను అధినేత చంద్రబాబు కేటాయించారు. టీడీపీ కమిటీలో 50 ఉప కులాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఓ ప్రకటన అధిష్టానం తెలిపింది. బీసీలకు 41, ఎస్సీలకు 11, ఎస్టీలకు 3, మైనార్టీలకు 6 శాతం చొప్పున కేటాయింపులు జరిగాయి. టీడీపీ రాష్ట్ర కమిటీలో మహిళలకు అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. కమిటీలో ఉన్నవారి సగటు వయసు 48 ఏళ్లుగా పేర్కొంది అధిష్టానం.

Next Story
Share it