చిత్తూరులో టీడీపీ నేతల గృహ నిర్భందం
By తోట వంశీ కుమార్ Published on 28 Aug 2020 9:40 AM ISTదళిత యువకుడు ఓం ప్రతాప్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని సోమలలో మూడు రోజుల క్రితం ఓం ప్రతాప్ అనే ఎస్సీ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు రెండు రోజులు ముందు ఏపీలో ప్రభుత్వ మద్యం విధానాన్ని విమర్శిస్తూ సీఎంను దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఆ తర్వాత రెండు రోజులకే యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వైసీపీ నేతల వేధింపులతోనే ఓం ప్రతాప్ చనిపోయాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతాప్ కుటుంబాన్ని పరామర్శించాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉదయం సోమల బయల్దేరేందుకు సమాయత్తమైన తేదేపా నేతలను ఎక్కడిక్కడ అడ్డుకున్నారు. చిత్తూరులో జిల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నానిని, పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిలను గృహానిర్భంధం చేశారు.