దేవినేని అవినాష్ కొద్ది సేపటి క్రితం తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి చేరుకున్నారు. జగన్‌తో సంప్రదింపుల అనంతరం ఆయన వైసీపీలో చేరారు. దేవినేని అవినాష్‌కు వైసీపీ కండువా కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో తెలుగు యువత నేతగా మంచి పాలోయింగ్ వున్న అవినాష్, తన పదవికి రాజీనామా చేశారు. అవినాశ్ తన రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. అవినాశ్‌తో పాటు సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు కూడా టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
![Avis2](https://telugu.newsmeter.in/wp-content/uploads/2019/11/avis2.jpg)