తమిళనాడులో రోడ్‌ టెర్రర్‌.. 19 మంది అక్కడికక్కడే మృతి

By అంజి
Published on : 20 Feb 2020 8:16 AM IST

తమిళనాడులో రోడ్‌ టెర్రర్‌.. 19 మంది అక్కడికక్కడే మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును కంటైనర్‌ లారీ ఢీకొట్టింది. ఈ ఘటన తిర్పూరు జిల్లా అవినాశి వద్ద చోటు చేసుకుంది.

Tamilnadu Road accident kills 19 persons

ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. మరో కొంతమంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. బస్సు తిర్పూరు నుంచి తిరువనంతపురం వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.

Tamilnadu Road accident kills 19 persons Tamilnadu Road accident kills 19 persons

మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. గాయపడ్డవారిని స్థానిక ప్రజలు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని సమాచారం.

Tamilnadu Road accident kills 19 persons

సేలం జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓమలూరు వద్ద కారు, బస్సు ఢీకొనడంతో ఐదుగురు నేపాల్‌ వాసులు మృతి చెందారు.

Next Story