తమిళనాడులోని శివకాశి సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణా సంచా తయారీ కర్మాగారంలో పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
పేలుడు ధాటికి బాణాసంచా తయారీ కూలీలు దూరంగా ఎగిరిపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటన పై కేసు నమోదు చేసుకుని కర్మాగారం యజమాని కోసం గాలిస్తున్నారు.