తమిళనాడులో జూలై 31 వరకు లాక్‌డౌన్.. ఎక్కడెక్కడ సడలింపులు అంటే..
By సుభాష్ Published on 30 Jun 2020 7:09 AM GMTదేశ వ్యాప్తంగా వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. గతంలో విధించిన లాక్‌డౌన్‌లో కేసులు తగ్గుముఖం పట్టినా.. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో ఆయా రాష్ట్రాలో మళ్లీ లాక్‌డౌన్ విధించే పనిలో పడ్డాయి. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం జూలై 31 వరకు లాక్‌డౌన్ విధించింది. మరికొన్ని రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్ వైపు మొగ్గుచూపుతున్నాయి. ఇక తాజాగా తమిళనాడులో కూడా మరో సారి లాక్‌డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. జూలై 31వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఇక కేంద్ర ప్రభుత్వం విధింధించిన నాలుగో విడత లాక్‌డౌన్ జూన్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో 31 వరకు మళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సర్కార్ ప్రకటించింది.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలకు సడలింపులు ఇస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మధురై, గ్రేటర్ చెన్నై పోలీస్ లిమిట్స్ లో మాత్రం జూలై 5 వరకు సంపూర్ణ లాక్‌డౌన్ కొనసాగుతుందని పేర్కొంది. గ్రేటర్ చెన్నై పరిధిలోని చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లురు ప్రాంతాల్లో మాత్రం జూలై 5 వరకు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక లాక్‌డౌన్ సడలింపులపై సమీక్షలు జరిపి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.
కాగా, దేశంలో కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు మళ్లీ లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి.ఇక రాష్ట్రంలో సోమవారం 3వేలకుపైగా కేసులు నమోదు కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 86వేలకుపై కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ మరణాల సంఖ్య 1,141కి చేరుకుంది. ఇక చెన్నైలో ఒకే రోజు 2,167 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 2,212 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో 37,331 మంది యాక్టివ్‌గా ఉన్నారు.