అంత గొప్ప ఫిజిక్ సొంతమవ్వాలంటే.. ఎంతగానో కష్టపడాలి.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 May 2020 11:11 AM ISTతమన్నా.. నాజూకు నడుము సుందరి. సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి దశాబ్దం పైగానే అయింది. అందం ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఫిజిక్ కాపాడుకుంటూ ఇప్పటికీ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. జిమ్ లో వర్కౌట్లు, యోగా, డైటింగ్ అన్నీ చేస్తూ అమ్మడు తన అందాన్ని కాపాడుకుంటూ వస్తోంది. అందుకు సంబందంచిన వీడియోలు అప్పుడప్పుడూ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో అప్డేట్ చేస్తూ ఉంటుంది.
తాజాగా తమన్నా ఓ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అందులో ఆమె యోగా చేయడానికి పడిన కష్టాన్ని మనకు చూపించింది. మోచేతులు, తలని బ్యాలెన్స్ చేస్తూ తలని ఖచ్చితంగా ఉంచుకుంటున్న వీడియోను.. అందుకు సంబంధించిన ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసింది. ట్రైనర్ సమక్షంలోనే ఇలాంటివి చేయాలని తమన్నా అందిరికీ చెబుతోంది. ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి సినిమా స్టార్స్ పడే కష్టం అంతా ఇంతా కాదని ఈ వీడియోలను చూస్తే అర్థమవుతుంది.
ఈ ఏడాది మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించిన తమన్నా ప్రస్తుతం గోపీ చంద్ సరసన.. సీటీమార్ సినిమాలో నటిస్తోంది. హిందీలో బోలె చూడియా సినిమాలో కూడా నటిస్తోంది. హిందీ రీమేక్ క్వీన్ సినిమా కూడా ఇంకా విడుదల కావాల్సి ఉంది.