టాలీవుడ్ హీరోల గురించి నోరువిప్పిన మిల్క్ బ్యూటీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Jun 2020 10:44 AM GMT
టాలీవుడ్ హీరోల గురించి నోరువిప్పిన మిల్క్ బ్యూటీ

మిల్క్ బ్యూటీ తమన్నా.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేసమయానికి ఆమె వయస్సు 15 సంవత్సరాలు. 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన తమన్నా.. అదే ఏడాది తెలుగులో కూడా శ్రీ సినిమాలో నటించింది. ఆ తర్వాత హ్యాపీడేస్ తో మంచి హిట్ అందుకున్న తమన్నాకు ఇప్పుడిప్పుడే అగ్రకథానాయకుల సరసన నటించే అవకాశాలొస్తున్నాయి. వెంకటేష్, చిరంజీవి, పవన్ కల్యాణ్ లతో సినిమాలు చేసి ఫర్వాలేదనిపించుకుంటోంది.

లాక్ డౌన్ కారణంగా షూటింగులు లేక ఇళ్లకే పరిమితమవ్వడంతో తెలుగు సినిమాల్లో నటించే హీరోయిన్లంతా ఇంట్లో వంటలు, ఇంటి పనులు చేస్తున్నారు. మొన్నీమధ్య నిహారిక ఆవకాయ్ పెట్టి వావ్ అనిపించుకుంది. ఇప్పుడు తమన్నా కూడా అదేబాటలో నడుస్తోంది. నేను కూడా ఆవకాయ్ పెడతానంటూ ఫ్యాన్స్ కు చెప్పింది. రెండ్రోజుల క్రితం సోషల్ మీడియాలో నెటిజన్లతో లైవ్ చిట్ చాట్ చేసిన సమంత టాలీవుడ్ హీరోలపై తన అభిప్రాయాలను పంచుకుంది.

మెగా హీరోలైన పవన్ కల్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్ ల్లో తనకెప్పుడూ గర్వం కనిపించలేదని చెప్పింది తమన్నా. కెమెరా మెన్ గంగతో రాంబాబు సినిమా చేసేటపుడు పవన్ కల్యాణ్ తో కలిసి పనిచేయడం చాలా కంఫర్ట్ గా అనిపించిందన్నారు. చిరంజీవితో నటించిన సైరా సినిమా కూడా అలాగే అనిపించిందని పేర్కొంది తమన్నా. ఇక ప్రభాస్ విషయానికొస్తే లేడీ ఫ్యాన్స్ అంటే అతడికి చాలా సిగ్గని చెప్పుకొచ్చిందీ మిల్క్ బ్యూటీ.

Next Story