మార్పు లేదు.. అదే రోజు రానా పెళ్లి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jun 2020 3:05 AM GMT
మార్పు లేదు.. అదే రోజు రానా పెళ్లి

టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో హీరో రానా ఒకరు. ఆయన త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇటీవలే తన ప్రేమ విషయం బయటపెట్టి అందరికి షాకిచ్చాడు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు సమ్మతి తెలపడంతో... మిహీకా బజాబ్‌తో కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు సిద్దమవుతున్నాడు రానా.

ఆగస్టు 8న రానా-మిహీకా బజాబ్‌ల పెళ్లి ముహూర్తాన్ని నిర్ణయించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. ఇందులో ఎటువంటి మార్పు ఉండవని చెప్పారు. కరోనా నిబంధనలు పాటిస్తూ అతి కొద్ది మంది సమక్షంలో తెలుగు, మార్వాడీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుకల్ని నిర్వహించబోతున్నారు. మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని సురేష్‌ బాబు చెప్పారు.

ఇదిలా ఉంటే.. రానా పెళ్లి వాయిదా పడిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో పెళ్లి తేదీని మార్చారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఇరు కుటుంబాలు స్పందించాయి. పెళ్లి తేదీలో ఎటువంటి మార్పు ఉండబోదని ప్రకటించాయి. ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా విరాటపర్వం 1992 అనే చిత్రంలో నటిస్తున్నాడు.

Next Story