ఉత్కంఠకు గురి చేస్తున్న 'పెంగ్విన్' ట్రైల‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jun 2020 8:36 AM GMT
ఉత్కంఠకు గురి చేస్తున్న పెంగ్విన్ ట్రైల‌ర్

'మహానటి' చిత్రంతో నేషనల్‌ అవార్డ్‌ అందుకుంది కీర్తి సురేష్‌. పేట‌ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు నిర్మాణంలో ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఆమె నటించిన సినిమా 'పెంగ్విన్'‌. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని జూన్‌ 19న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ ను కొద్ది సేపటి క్రితమే విడుదల చేశారు. ట్రైలర్ ని తెలుగులో హీరో నాని.. మలయాళంలో మోహన్ లాల్.. తమిళ్ లో ధనుష్ విడుదల చేశారు.

తప్పిపోయిన కుమారుడిని వెతికే పాత్రలో కీర్తీ నటించగా.. ట్రైల‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరిస్తున్నాయి. 'మీ అందరి కథల వెనుక ఓ అమ్మ కథ ఉంది. ఎందుకంటే మీ ప్రయాణం ప్రారంభించేది ఆమె నుంచే..' అని టీజర్లో చూపించారు. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్‌ పై మీరు ఓ లుక్కుయండి..

Next Story