అమితాబ్‌ టంగ్‌ ట్విస్టర్‌.. వీడియో వైరల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jun 2020 4:03 AM GMT
అమితాబ్‌ టంగ్‌ ట్విస్టర్‌.. వీడియో వైరల్‌

ఏడు పదుల వయసులోనూ అమితాబ్‌ బచ్చన్‌ ఉత్సాహాంగా సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇక ఎలాంటి డైలాగ్‌ అయిన తనదైన శైలిలో చెప్పేసే బిగ్‌బీ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటూ సరదాగా ట్వీట్లు చేస్తుంటాడు. ఇక తాజాగా ఆయన నటించిన చిత్రం 'గులాబో సితాబో'. ఈ చిత్రం ఈ నెల 12న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్‌ కోసం అమితాబ్‌ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్‌ చేశాడు. ఓ పెద్ద హిందీ డైలాగ్‌ని ఐదుసార్లు తడబడకుండా చెప్పారు. ఈ టంగ్‌ ట్విస్టర్‌ను ఇలాగే చెప్పాలని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో పాటు దీపిక పదుకొణే, రణభీర్‌ కపూర్‌, భూమి ఫెడ్నేకర్‌, అలియా భట్‌, కార్తిక్‌ ఆర్యన్‌ తదితరులను నామినేట్‌ చేశాడు.

సూజిత్‌ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పాత హవేలీ యజమానీ మీర్జా షేక్‌గా అమితాబ్‌ కనిపించనుండగా.. ఆయన ఇంట్లో అద్దెకి ఉండే వ్యక్తి బాంకీగా సోధిగా ఆయుష్మాన్‌ కనిపించనున్నారు. ఇది కష్టమైన పని భూమి కామెంట్‌ పెట్టగా,ఆయుష్మాన్ మాత్రం తనదైన శైలిలో పూర్తి చేశారు. దీనిని వరుణ్‌ ధావన్‌, అర్జున్ కపూర్, తాప్సీ, కరణ్‌ జోహార్‌లకి విసిరారు.ప్రస్తుతం అమితాబ్‌ టంగ్‌ ట్విస్టర్‌ వీడియో నెటింట్లో వైరల్‌ అవుతుంది. నెటీజన్లు అమితాబ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Next Story