తబ్లీగీ జమాత్‌ భవనాన్ని కూల్చేయాలి.. సుప్రీంకోర్టులో పిటిషన్‌

By అంజి  Published on  7 April 2020 5:23 PM GMT
తబ్లీగీ జమాత్‌ భవనాన్ని కూల్చేయాలి.. సుప్రీంకోర్టులో పిటిషన్‌

ఢిల్లీ: నిజాముద్దీన్‌లో ఉన్న మర్కజ్‌లో తబ్లీగీ జమాత్‌ కార్యకలాపాలన్నిటీని పూర్తిగా నిషేధించాలంటూ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. తబ్లీగీ జమాత్‌ కార్యకలాపాలను నిషేధించే విధంగా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని అజయ్‌ గౌతమ్‌ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎంసీడీ చట్టంలోని ప్రొవిజన్ల ప్రకారం దీనిపై నిషేధాన్ని విధించాలని, అలాగే మర్కజ్‌ భవనాన్ని కూడా కూల్చివేయాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. భారత ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఏ బోబ్డేకు ఓ లేఖ ద్వారా అజయ్‌ గౌతమ్ తన పిటిషన్‌ను పంపారు.

మర్కజ్‌లో మత ప్రార్థనల పేరుతో దేశంలో కరోనా వైరస్‌ వ్యాపించే విధంగా కొందరు కుట్ర పన్నారని, వారిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని పిటషన్‌ కోర్టును కోరాడు. ఢిల్లీ ప్రభుత్వం మార్చి 12, 16 తేదీల్లో ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే వీటిని అమలు చేయడంలో విఫలమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ సుప్రీంకోర్టును కోరాడు.

కరోనా కేసుల్లో ఎక్కువ భాగం ఢిల్లీలో జరిగిన తబ్లీగీ జమాత్‌ కార్యక్రమానికి హాజరైన వారే. దేశ వ్యాప్తంగా ఉన్న కరోనా కేసులన్నీ.. మర్కజ్‌కు సంబంధం ఉన్నవే. మర్కజ్‌లో జరిగిన సమావేశాల్లో పాల్గొన్న చాలా మందిని క్వారంటైన్‌ చేశామని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. తబ్లీగీలతో పాటు, వారి బంధువులు, సన్నిహితులను క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచారు. నావెల్‌ కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది.



Next Story