క్రికెట్ పండుగకు టికెట్ల సేల్ మొదలు

By Newsmeter.Network  Published on  29 Nov 2019 8:24 AM GMT
క్రికెట్ పండుగకు టికెట్ల సేల్ మొదలు

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం డిసెంబర్ 6 న భారత వెస్టిండీస్ టీ 20 క్రికెట్ మ్యాచ్ కోసం ముస్తాబౌతోంది. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు, భారత మాజీ క్యాప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ చెప్పారు. ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకం శుక్రవారం నుంచి ప్రారంభమౌతుందని కూడా ఆయన చెప్పారు. టికెట్లు ఈవెంట్స్ నౌ డాట్ కామ్ వెబ్ సైట్లో లేదా సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ లో కానీ దొరుకుతాయని ఆయన చెప్పారు. ఈ కౌంటర్ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా తెరిచి ఉంటుందని ఆయన అన్నారు. టికెట్ల ధర అత్యల్పంగా రూ. 800 (నార్త్ పెవిలియన్ లో), అత్యధికంగా రూ. 12,500 (సౌత్ పెవిలియన్ గ్రౌండ్ ఫ్లోర్) ఉంటుందని ఆయన తెలిపారు. స్టేడియం కెపాసిటీ 39000 ఉంటుందని ఆయన తెలిపారు.

ఎన్నో మ్యాచ్ లు హైదరాబాద్ గడ్డపై ఆడిన అజరుద్దీన్ కి ఈ మ్యాచ్ ఒక కొత్త అనుభవం కాబోతోంది. క్రికెట్ నిర్వాహకుడి రూపంలో ఆయన స్టేడియంలోకి తొలి సారి అడుగుపెడుతున్నారు. ఇది తనకొక్క కొత్త అనుభూతి అని, ఆటలోని ఆనందాన్ని ప్రేక్షకులు పూర్తిగా అనుభవించగలిగేలా అన్ని ఏర్పాట్లూ చేస్తామని అజర్ చెప్పారు.

Next Story
Share it