జర్మనీ యువతి ప్రేమలో పడ్డ తెలంగాణ యువకుడు..!

By అంజి  Published on  18 Dec 2019 6:24 AM GMT
జర్మనీ యువతి ప్రేమలో పడ్డ తెలంగాణ యువకుడు..!

హైదరాబాద్‌: ప్రేమకు కులం, మతం, ప్రాంతంతో సంబంధం ఉండదు. రెండు మనసులు కలిస్తే చాలు.. ప్రేమకు మించిన శక్తి మరేదీ లేదు. అందుకు నిదర్శనం తామేనని హైదరాబాద్‌కు చెందిన యువకుడు, జర్మనీకి చెందిన యువతి నిరూపించుకున్నారు. ఖండాంతరాలు, దేశాలు దాటి ప్రేమను గెలిపించుకున్నారు. జర్మనీలో యువకుడు స్వర్ణకార్ ఉద్యోగం చేస్తున్న సమయంలో అక్కడి యువతి జూలియాతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. స్వర్ణకార్‌ తెలంగాణ జాగృతి విభాగం జర్మనీ విభాగం అధ్యక్షులుగా పని చేస్తున్నాడు. త్వరలో ఈ జంట ఏడు అడుగులు వేయబోతోంది. స్వర్ణకార్‌, జూలియా పెళ్లికి ఇరువైపుల తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. డిసెంబర్‌ 22న బేగంపేటలో తెలుగు సాంప్రదాయం ప్రకారం స్వర్ణకార్‌, జులియా వివాహం జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణకు వచ్చిన ఆ భగ్న ప్రేమికులు జాగృతి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్‌ నాయకురాలు కవితను కలిసి పెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. వారి ప్రేమ గురించి అడిగి తెలుసుకున్న కవిత.. ఆ జంటను అభినందించారు. జర్మనీ దేశంలో ఉద్యోగం చేస్తున్న స్వర్ణకార్‌.. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేవారు. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు తెలంగాణకు సంబంధించిన సంప్రదాయాలతో కూడిన బతుకమ్మ, బోనాలు పండగలను నిర్వహించేవాడు.

Next Story