చెత్తలో దొరికిన వెడ్డింగ్ రింగ్..!

By Newsmeter.Network  Published on  17 Dec 2019 3:19 AM GMT
చెత్తలో దొరికిన వెడ్డింగ్ రింగ్..!

పొరపాటున పెళ్లి ఉంగరం కనిపించకుండా పోతే ఇల్లంతా జల్లెడ పడతాం. కిందా మీద, అటు ఇటు వెతికి వెతికి ఇల్లంతా చెత్త చేసేస్తాం. అదే వెడ్డింగ్ రింగ్ చెత్తలో పడిపోతే.. అలాంటి సంఘటనే జరిగింది ఆస్ట్రేలియాలో. మెల్‌బోర్న్‌కు చెందిన ఒక జంట తమ ఇంటి రేనోవేషన్స్ లో భాగంగా చెత్తను ఒక వేస్ట్ కలెక్షన్ సెంటర్ లో పడేసి వచ్చారు. అయితే దానిలో వారి వెడ్డింగ్ రింగ్ కలిసిపోయింది. ఇంటికి వచ్చిన తరువాత విషయాన్ని గుర్తించిన ఆ దంపతులు ఆ డంపింగ్ సెంటర్ కు కాల్ చేశారు. దీంతో ఒక టీమ్ చెత్త కలెక్షన్ సెంటర్‌కు వెళ్లింది. ఆ జంటతో కలసి 30 టన్నుల చెత్తలో కలిసిపోయిన జ్యూయరీ బాక్సు కోసం వెదకటంలో సహాయపడింది. ఉదయం 4 గంటలకు కలెక్షన్ సెంటర్‌కు వచ్చిన ఆ జంట చెత్తనంతటినీ కింద పోయించి, దానిలో తమ జ్యూయరీ బాక్సు కోసం సుమారు 3 గంటలపాటు వెదికి చివరకు సాధించారు. దీంతో వారి ఆనందానికి అవధులులేవు. టీమ్ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు. ఇదంతా క్రిస్టమస్ మేజిక్ గా భావిస్తున్నామంటున్నారు ఆ దంపతులు.

నిజానికి ఒకసారి పడేసిన చెత్తలో వెదకటం చాలా ప్రమాదకరమని, అందులో విరిగిన ఫర్నిచర్, మిషనరీ, గాజుపెంకులు వంటివాటితో పాటు అంతకంటే ప్రమాదకరమైనవి, అనార్యోగ్యం కలిగించేవి కూడా ఉండవచ్చని చెబుతున్న అధికారులు నిపుణులైన తమ సిబ్బంది ఎలాంటి పరిస్థులలోనైనా పని చేయగలరని ఈ సంఘటన మరోసారి రుజువు చేసిందని చెబుతున్నారు.

Next Story