బుద్దిలేదా..? ఆ కరోనాకు నీవు మొనగాడివని తెలుసా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 March 2020 8:59 AM GMTకరోనాపై ప్రజలలో అవగాహన కలిపించేందుకు బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్ పూర్‌లో తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ మైకు పట్టుకుని వీధులలో తిరిగారు. ప్రజలు ఎవరిని ఇంట్లో నుండి రావొద్దని హెచ్చరించారు. కిస్మత్ పూర్ లోని ప్రధాన రహదారిపై ఇతరులెవరూ బయట తిరగవద్దని.. దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారని మైకు ద్వారా వెల్లడించారు.
నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ జారీచేసిన స్పష్టమైన నిబంధనలు పాటించాలని ప్రజలను హెచ్చరించారు. లేని పక్షంలో ఆ మహమ్మారి బారినపడే అవకాశముందని సూచించారు.
స్వామిగౌడ్ మైక్‌లో,, కేసీఆర్ గారు అర్థిస్తున్నరు.. ఓటయ్యమని కాదు.. మీ బిడ్డలను కాపాడుకొమ్మని.. అయినా కానీ.. మనం నిర్లక్ష్యంగా తిరుగుతున్నాం. దయచేసి ఎవరూ పిల్లలను బయటకు పంపడం కానీ, మీరు బయటకు రావడం కానీ చేయకూడదని అన్నారు.
స్వామిగౌడ్ మైకులో మాట్లాడుతుండగా.. అటుగా ఇద్దరు మాస్కులు ధరించకుండా బైకుపై రాసాగారు. వారిద్దరిని ఆపి.. మీకు మీరు హీరోల్లాగా ఫీలవుతున్నారా..? మీకు ఆ రోగం రాదనుకుంటున్నారా..? లేక ఆ కరోనాకు నీవు మొనగాడివని తెలుసా..? బుద్ది లేకుండా తిరుగుతూ మా గ్రామాలను నాశనం చేస్తారా అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఇదిలావుంటే.. కరోనా విజృంబిస్తున్న నేఫథ్యంలో నిన్న రాత్రి 8గంటలకు ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్ 14వరకూ లాక్‌డౌన్ ప్రకటించారు.
[video width="640" height="352" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/03/WhatsApp-Video-2020-03-25-at-1.18.44-PM.mp4"][/video]