నొప్పి లేకుండా ఎలా చనిపోవాలని గూగుల్‌లో వెతికిన సుశాంత్ సింగ్
By తోట వంశీ కుమార్ Published on 3 Aug 2020 8:05 PM ISTబాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. మిస్టరీ కేసును ఛేదించేందుకు బీహర్ పోలీసులు, ముంబై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. సుశాంత్ వాడిన సిమ్‌కార్డులు ఆయన పేరు మీద లేనట్లు ఇప్పటికే గుర్తించగా.. ఇప్పుడు మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సోమవారం ముంబయి పోలీసు కమిషనర్ సంజయ్ బ్రావో మాట్లాడుతూ.. సుశాంత్ చనిపోవడానికి ముందు మరణం గురించి ఇంటర్నెట్‌లో వెతికనట్లు చెప్పారు. పెయిన్‌లెస్ డెత్, షిజోఫ్రేనియా, బైపోలర్ డిజార్డర్ లాంటి పదాలను అతను గూగుల్‌లో వెతికినట్లు తెలిపారు.
సుశాంత్ చనిపోవడానికి ఐదు రోజుల ముందు ఆయన మాజీ మేనేజర్ దిశా షాలిని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనతో సుశాంత్‌కు సంబంధం ఉన్నట్లు పలు వార్తలు వెలువడ్డాయి. దీంతో సుశాంత్ ఆందోళనకు గురయ్యాడని, దిశ గురించి తన గురించి వచ్చిన కథనాల్ని చదివారని ముంబై సీపీ వెల్లడించారు. చనిపోవడానికి ముందురోజు రాత్రి దాదాపు రెండు గంటలపాటు సుశాంత్ ఇంటర్నెట్‌లో తన గురించిన వివరాలు సెర్చ్ చేశాడని వెల్లడించారు. ఆతరువాత నొప్పి లేకుండా చనిపోవడం ఎలా..? మానసిక ఒత్తిడి సమస్యలు తదితర విషయాలపై కూడా గూగుల్‌లో వెతికాడు అని అన్నారు.
జూన్ 14న ముంబై, బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుకోగా.. అంతకు 5రోజుల ముందు నటుడి మాజీ మేనేజర్ దిశా బలవన్మరణం చెందింది. ఆమె చనిపోయే ముందురోజు పార్టీకి తనకు కాబోయే భార్యతో హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి అతడి ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్కిజో ఫ్రెనియా అంటే ఏమిటీ..?
స్కిజో ఫ్రెనియా అంటే అంటే మెంటల్ హెల్త్ కండీషన్ సమస్య తీవ్రంగా ఉండడం, ఈ సమస్యతో బాధపడే వారు తమని ఎవరో ఏదో చేస్తున్నారని, తమ గురించే మాట్లాడుకుంటున్నారని ఇలా ఊహించుకోవడాన్ని స్కిజోఫ్రెనియా అంటారు.
బైపోలార్ డిజార్డర్ అంటే ఏమిటీ..?
సినిమాల్లోనైనా అందరూ రోలర్ కోస్టర్ ను చూసే ఉంటారు కదా. దాని మీదికెక్కిన వారు అకస్మాత్తుగా పైపైకి వెళ్తుంటారు. అంతలోనే లోయలోకి దూకినట్టుగా కిందికి వేగంగా దిగిపోతుంటారు. ఒక చోట గిరా గిరా గిరా గిరికీలు కొడతారు. బైపోలార్ వ్యాధిలోనూ అంతే. మెదడులో మన మూడ్స్ కాస్తా రోలర్ కోస్టర్ ఎక్కి… అవి గబగబా మారిపోతే… మనిషి గింగిరాలు తిరుగుతాడు. అలా మూడ్స్ మాటిమాటికీ మారిపోతున్నప్పుడు ఆ మనిషి కాసేపు అపరిమితమైన సంతోషాలూ, అంతులేని ఉత్సాహాలూ కనబరుస్తూ… అవి కాస్తా తగ్గిపోయాక తీవ్రమైన నిరాశలో, నిస్పృహలో, అంతులేని కుంగుబాటులో మునిగిపోయే జబ్బే ఈ బైపోలార్ డిజార్డర్.