ఎవర్ని మోసం చేయాలని అనుకుంటున్నారు.. సుశాంత్ ది హత్యేనంటూ సంచలన వీడియో..!

By సుభాష్  Published on  3 Aug 2020 11:07 AM GMT
ఎవర్ని మోసం చేయాలని అనుకుంటున్నారు.. సుశాంత్ ది హత్యేనంటూ సంచలన వీడియో..!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను హత్య చేసి చంపేశారని ఎంతో మంది ఆరోపిస్తూ ఉన్నారు. బీహార్ పోలీసులకు ముంబై పోలీసులు కనీసం సహకరించకపోవడం కూడా వివాదానికి దారి తీస్తోంది. సుశాంత్ మరణానికి ముందు ఓ పార్టీ జరిగిందని ఆ పార్టీలో ముఖ్యమంత్రి కుమారుడు కూడా పాల్గొన్నాడని కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే..! తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది హత్య అంటూ మీనాక్షి మిశ్రా అనే వైద్యురాలు పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం సంచలమైంది.

ఇది ఆత్మహత్య కాదని, సుశాంత్ మృతదేహం పరిశీలిస్తే హత్య అనిపిస్తోందని ఆరోపించారు. డాక్టర్ మీనాక్షి తన వీడియోలో సుశాంత్ ముఖంపై ఉన్న గాయాలను చూపించారు. కంటిపై ఎవరో గుద్దినట్టుగా ఉందని, కంటిపైభాగంలో ఉబ్బిపోయి ఉండడమే అందుకు కారణమని వివరించారు. సాధారణంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటే కళ్లు బయటికి పొడుచుకు వచ్చినట్టుగా ఉంటాయని, నాలుక కూడా బయటికి సాగి ఉంటుందని వెల్లడించారు. సుశాంత్ విషయంలో అలా జరగలేదని, ఓ కన్ను సగం తెరుచుకుని ఉందని, నాలుక కూడా మామూలుగానే ఉందని తెలిపారు. పోలీసులు అతడి మృతదేహాన్ని ఎవరి పర్మిషన్ తీసుకుని కిందకు దించారో సమాధానం తెలపాలంటూ ఆమె వీడియోలో చెప్పుకొచ్చారు. సుశాంత్ ను హత్య చేసి చంపారని మెడ మీద ఉన్న మార్క్ ను చూస్తేనే చెప్పేయొచ్చని.. ప్రజలను మోసం చేయాలని అనుకోవద్దని ఆమె చెబుతున్నారు. శవం కూడా ఫ్రెష్ గా లేదని.. అతడు చనిపోయి చాలా గంటలు అయ్యుండొచ్చనే అనుమానాలను మీనాక్షి మిశ్రా వెల్లడించారు.

ఈ వీడియోను బీజేపీ అగ్రనేత సుబ్రహ్మణ్యస్వామి రీట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

తన మాజీ మేనేజర్ దిశా సలియా జూన్ 9న మరణించగా, ఆమె గురించి గూగుల్ లో విపరీతంగా సెర్చ్ చేశాడని ముంబయి పోలీసులు తాజాగా వెల్లడించారు. సుశాంత్ చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన గురించి తాను గూగుల్ లో బాగా సెర్చ్ చేశాడని తెలిపారు. దిశా సలియా ఆత్మహత్య వ్యవహారంలో తన గురించి ప్రచారం జరుగుతోందన్న ఆందోళన సుశాంత్ లో ఏర్పడినట్టు భావించాడని అంటున్నారు ముంబై పోలీసులు. అతడు బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతని ముంబయి పోలీస్ చీఫ్ పరమ్ వీర్ సింగ్ తెలిపారు.Next Story