సుశాంత్ మరణాన్ని తట్టుకోలేక.. టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
By తోట వంశీ కుమార్ Published on 17 Jun 2020 7:00 AM GMTబాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన ఇంట్లో ఆదివారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. సుశాంత్ మృతితో దేశమంతా షాక్‌కు గురైంది. సుశాంత్ మరణించి రోజులు గడుస్తున్నా.. ఇంకా ఆ బాధ నుంచి బయటికి రాలేకపోతున్నారు. సుశాంత్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని బాలీవుడ్ ప్రముఖులు గుర్తుచేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. తన అభిమాన నటుడి మరణవార్త విని తట్టుకోలేక ఓ విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో చోటు చేసుకుంది. బరేలికి చెందిన పదో తరగతి విద్యార్థికి సుశాంత్ అంటే ఇష్టం. అతడికి వీరాభిమాని. అతడి సినిమాలు అంటే ఎంతో ఇష్టపడేవాడు. సుశాంత్ మృతిచెందడంతో ఆ విద్యార్థి తట్టుకోలేకపోయాడు. తన హీరోలేని జీవితం తనకు వద్దని తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ లేఖలో " నా హీరో ఆత్మహత్య చేసుకోగా లేనిది నేను చేసుకోలేనా " అంటూ రాసి ఉంది.
సుశాంత్ మృతి చెందిన మూడు రోజులకే ఆయన ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో తట్టుకోలేకపోయిన ఆయన వదిన అనారోగ్యానికి గురై మృతిచెందిన విషయం తెలిసిందే.