బిగ్‌ బ్రేకింగ్‌.. నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌‌ ఆత్మహత్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Jun 2020 9:20 AM GMT
బిగ్‌ బ్రేకింగ్‌.. నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌‌ ఆత్మహత్య

సినీ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 'ధోని ది అన్‌టోల్డ్‌ స్టోరీ' చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆయన వయసు 34 సంవత్సరాలు మాత్రమే.

తొలుత టీవీ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత 2013లో బాలీవుడ్‌ చిత్రం 'కై పో చే' చిత్రంతో బాలీవుడ్‌ పరిచయం అయ్యాడు. 'శుద్ధ్‌ దేశీ రొమాన్స్'‌, 'పీకే' వంటి చిత్రాల్లో నటించాడు. భారత జట్టు మాజీ కెప్టెన్‌ జీవిత కథ ఆధారంగా తెరక్కెకిన 'ఎంఎస్‌ధోని ది అన్‌టోల్డ్‌' స్టోరీతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సుశాంత్ చివరగా 'చిచ్చోరే' చిత్రంలో నటించాడు. లాక్ డౌన్ నేపథ్యంలో బాంద్రాలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నాడు. కొన్నిరోజులుగా అతని పరిస్థితి ఏమీ బాగాలేదని, ఉరేసుకుని చనిపోయినట్టు భావిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు. అయిదు రోజుల క్రితమే ఆయన మాజీ మేనేజర్ దిశా సెలియన్ సూసైడ్ చేసుకున్న సంగతి విదితమే. దిశా సెలియన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియకముందే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.

Next Story
Share it