నిన్న పెద్దలు కుదిర్చిన పెళ్లి.. నేడు ప్రేమ పెళ్లి.. రెండు పెళ్లిళ్లు చేసుకున్న యువతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Jun 2020 3:40 AM GMT
నిన్న పెద్దలు కుదిర్చిన పెళ్లి.. నేడు ప్రేమ పెళ్లి.. రెండు పెళ్లిళ్లు చేసుకున్న యువతి

ఇదో విచిత్ర ఘటన. ఓ యువతి రెండు రోజుల్లో రెండు పెళ్లిళ్లు చేసుకుంది. మొదటి పెళ్లి పెద్దలు కుదిర్చిన వివాహం కాగా.. రెండో పెళ్లి తాను ప్రేమించిన అబ్బాయితో. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో జరింగింది.

వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా కనగల్‌ మండలం శాబ్దులాపురానికి మౌనికకు దేవరకొండకు చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయించారు. శుక్రవారం వీరి వివాహం అంగరంగవైభవంగా జరిగింది. కాగా.. ఆ యువతి కొన్నాళ్లుగా రాజేశ్‌ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఆయువకుడు ఆమెకు మామయ్య వరుస అవుతాడు. కాగా.. వివాహం అయిన కొద్ది సేపటికి అక్కడికి రాజేశ్‌ వచ్చాడు. మౌనిక అందిరి ముందు రాజేశ్‌ను పట్టుకుని ఏడ్చింది.

దీంతో పెళ్లికొడుకుతో పాటు అతడి తరుపు బంధువులు కంగుతిన్నారు. ఇదేంటని వారు ప్రశ్నించారు. ఇక ఈ పంచాయతీ పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లింది. అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో ఇరు వర్గాలు పెళ్లిని రద్దు చేసుకున్నాయి. దీంతో తన ప్రియుడిని వివాహమాడే అవకాశం మౌనికకు లభించింది. దాంతో పెళ్లయిన మరుసటి రోజే శనివారం వారికి మళ్ళీ గుడిలో పెళ్లి జరిపించారు.

Next Story