హోం క్వారంటైన్‌లో మంత్రి హరీశ్‌రావు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jun 2020 5:33 AM GMT
హోం క్వారంటైన్‌లో మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. సిద్దిపేటలోని ఆయన పీఏకు కరోనా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో మంత్రితో పాటు ఆయన వెంట ఉండే 51 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపారు. ఈ ఫలితాల్లో మంత్రితో పాటు మరో 17 మందికి కరోనా నెగిటివ్‌గా వచ్చిందని అధికారులు తెలిపారు. అయినప్పటికి ముందు జాగ్రత్త చర్యగా మంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు.

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యేకు కరోనా సోకడం ఇదే తొలిసారి. ఇక ఇటీవల జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో మేయర్‌కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్‌ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతి రోజు దాదాపు 150కి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఎక్కువగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న ఒక్క రోజే164 కేసులు నమోదు అయ్యాయి.

Next Story