టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jun 2020 3:21 AM GMT
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

కరోనా మహమ్మారి రాష్ట్రంలో విజృంభిస్తోంది. టీఆర్‌ఎస్‌ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు. రాష్ట్రంలో తొలిసారి ఓ ఎమ్మెల్యే కరోనా బారీన పడడం ఇదే తొలిసారి. శుక్రవారం సాయంత్రం స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులు కరోనా బారీన పడడం జరగగా.. తెలంగాణలో ఓ ఎమ్మెల్యేకి కరోనా రావడం ఇదే మొదటిసారి. ఇక ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌ నిర్థారణ కావడంతో.. కార్యకర్తలు, ఆయన్ను కలిసిన వారిలో ఆందోళన నెలకొంది.

ఇక రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శుక్రవారం మరో 164 కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి రవకు 4,484 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 174 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో 2,278 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 2,032 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధిక కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Next Story