మంత్రి హరీశ్‌రావు పీఏకు కరోనా పాజిటివ్‌..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jun 2020 7:49 AM GMT
మంత్రి హరీశ్‌రావు పీఏకు కరోనా పాజిటివ్‌..!

కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతోంది. భారత్‌లో ప్రతి రోజు తొమ్మిది వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానానికి చేరింది. ఇక లాక్‌డౌన్‌లో నిబంధనలు సడలించడంతో తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ప్రతి రోజు రెండువందలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. తాజాగా మంత్రి హరీష్‌రావు సిద్దిపేట పీఏకు కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధుల వద్ద పనిచేసే సిబ్బందులకు కరోనా సోకుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కట్టుదిట్టమైన కార్యాచరణ రూపొందిస్తోంది. కాగా.. నిన్న హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్ కు కరోనా సోకిందనే వార్త వినిపించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it